గంజాయి సేవిస్తూ.. గొడవలు.. విద్యార్థులపై ఫిర్యాదు

570చూసినవారు
గంజాయి సేవిస్తూ.. గొడవలు.. విద్యార్థులపై ఫిర్యాదు
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే కొంతమంది విద్యార్థులు గంజాయి సేవిస్తూ గొడవలు చేస్తున్నారని ఇందిరమ్మ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి కాలనీ వాసులు బుధవారం ఫిర్యాదు చేశారు. గంజాయి సేవిస్తూ పెద్దగా అరుస్తూ, వెకిలి చేష్టలు చేస్తూ భయాందోళనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సైతం ప్రిన్సిపాల్ కి చూపించారు.

ట్యాగ్స్ :