పరీక్షలకు భయపడి బెల్లంపల్లి పట్టణంలోని ఇంక్లైన్ బస్తి కి చెందిన మహా శివప్రియ (20) ఆత్మహత్య చేసుకుంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని ఫార్మసీ కళాశాల సమీపంలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఫార్మా డీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం నుంచి పరీక్షలు ప్రారంభమవగా ఉత్తీర్ణత సాధిస్తానో లేదో అని భయాందోళన చెంది ఉదయం హాస్టల్ భవనం రెండు అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది.