మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి

60చూసినవారు
మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలి
చెన్నూర్ పట్టణంలో గురువారం ఐద్వా అధ్వర్యంలో మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా పట్టణ కార్యదర్శి బోగే నాగజ్యోతి మాట్లాడుతూ మహిళకు చదువుకునే హక్కు ఉండాలని పోరాడిన పూలే స్ఫూర్తితో దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్