5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

71చూసినవారు
నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామంలో రూ. 15 లక్షలు విలువ చేసే 5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గ్రామంలోని కర్నకొండ చంద్రశేఖర్ తన ఇంటి ఆవరణలో నిషేధిత బిటి-3 నకిలీ పత్తి విత్తనాలు అక్రమ నిల్వ చేసి రైతులకు అమ్ముతున్నాడనే సమాచారం మేరకు తనిఖీ చేసి పట్టుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్