మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం రాజుగూడ గ్రామ పంచాయతీ జైతుగూడకు చెందిన మారినేని మైసయ్య అనే నిరుపేద గిరిజనుడు కొద్దిరోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం మరణించాడు. దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కంది సతీష్ కుమార్ మృతుడి కుటుంబ సభ్యులను పరమర్శించి, వారికి దహన సంస్కారాల కొరకు 3000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆడాయి కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.