లక్షేటిపేట్ మున్సిపాలిటీలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవన పనులను మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శుక్రవారం పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత లోపం లేకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, మంచిర్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.