Feb 11, 2025, 10:02 IST/
గ్రామ పంచాయతీల అభివృద్ధికి తెలంగాణలో కేరళ మోడల్: మంత్రి సీతక్క
Feb 11, 2025, 10:02 IST
తెలంగాణలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి చేసేందుకు కేరళ మోడల్‌ను అమలు చేయనున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు. మంగళవారం సచివాలయంలో CRISP సంస్థ మెంబర్ సెక్రటరీ, రిటైర్డ్ IAS ఆర్.సుబ్రహ్మణ్యంతో మంత్రి సమావేశమై చర్చించారు. ఈ సందర్బంగా తమ సంస్థ కార్యకలాపాలను మంత్రికి క్రిస్ప్ మెంబర్ సుబ్రహ్మణ్యం వివరించారు. కేరళ మాజీ సీఎస్ విజయానంద్ అధ్యక్షతన 10 మంది సీనియర్ రిటైర్డ్ IAS అధికారుల ఆధ్వర్యంలో ‘క్రిస్ప్’ సంస్థ పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.