124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్‌

56చూసినవారు
124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్‌
మనూ భాకర్ ఒకే ఒలింపిక్స్‌ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళ. ఇది మాత్రమే కాకుండా, ఈ ఘనత సాధించిన తొలి 'ప్యూర్ ఇండియన్' అథ్లెట్‌గా కూడా నిలిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్-ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచార్డ్ పేరిట ఉంది. ఈయ‌న 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్‌ తరఫున 124 ఏళ్ల తర్వాత మనూ ఈ రికార్డు బద్దలు కొట్టింది.
Job Suitcase

Jobs near you