విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు

69చూసినవారు
విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు
విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాక్‌ నిర్వహణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పలు రూట్లలో నడిచే రైళ్ల రాకపోకల్లో మార్పులు చేసినట్టు అధికారులు తెలిపారు. ఈనెల 21 నుంచి ఆగస్టు 15 వరకు విజయవాడ మీదుగా వెళ్లే 25 రైళ్లు రద్దు చేసినట్టు పేర్కొన్నారు. ఈనెల 24 నుంచి 28 వరకు 8 రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు. 11 రైళ్లను దారి మళ్లించనున్నారు. పాక్షికంగా రద్దు చేసిన రైళ్లను రామవరప్పాడు స్టేషన్‌ వరకు నడపనున్నట్టు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్