ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి, ఏడుగురికి గాయాలు (వీడియో)

78చూసినవారు
హర్యానాలోని సోనెపట్‌ జిల్లా రిదౌ గ్రామంలోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంట్లోని ఉన్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు., అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో పటాకుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you