యూపీలో జరిగే ఉప ఎన్నికల్లో ఖాళీ అయిన అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), భీమ్ ఆర్మీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) రెండూ ప్రకటించాయి. పది అసెంబ్లీ స్థానాల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఆజాద్ సమాజ్ పార్టీ (ఏఎస్పీ) కూడా సై అంటోంది.10 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామని ఏఎస్పీ చీఫ్ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రకటించారు.