మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో శనివారం బిజెపి నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మెదక్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు నాయకత్వాన్ని బలపరచాలన్నారు. కమలం గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎనగండ్ల బూత్ అధ్యక్షులు మంగలి లింగం, మందాపూర్ బూత్ అధ్యక్షులు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.