మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం కొల్చారం మండల కేంద్రంలోని బాబా ఫంక్షన్ హాల్ లో మండలంలోని గణేష్ మండప నిర్వాహకులు ప్రజాప్రతినిధులతో ఎస్సై మహమ్మద్ గౌస్ శాంతి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. శాంతియుత వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలన్నారు. గణేష్ మండప నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో పేరు నమోదు చేసుకుని పర్మిషన్ తీసుకోవాలన్నారు. డిజె సౌండ్ అనుమతి లేదన్నారు.