
కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వం: మంత్రి ఉత్తమ్
TG: కృష్ణా జలాల పంపకాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణకు అన్యాయం జరగనివ్వమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల హక్కులను రక్షించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. కృష్ణా నదీ జలాల కేటాయింపు విషయమై ఏపీ ప్రభుత్వం ధాఖలు చేసిన పిటిషన్ గురువారం సుప్రీం కోర్టులో విచారణకు రాగా మంత్రి ఉత్తమ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులతో కలిసి విచారణకు హాజరయ్యారు.