ప్రయాణికులతో నిండిపోయిన ఎంజీబీఎస్ (వీడియో)
సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎంజీబీఎస్ బస్టాండ్ ప్రయాణికులతో నిండిపోయింది. నేటి నుంచి వరుసగా సెలవులు లభించడంతో అందరూ సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో రాత్రి నుంచే ఎంజీబీఎస్ బస్టాండు ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పండుగ దృష్ట్యా అదనపు బస్సులు నడుపుతున్నట్లు టీజీఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించాయి.