తమ సమస్యల పరిష్కారం కోసం కొద్ది రోజులుగా అంగన్వాడీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గురువారం అంగన్వాడీ ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయంతో మంత్రి సీతక్కను కలిసి తమ డిమాండ్లపై వినతి పత్రం అందించారు. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క అంగన్వాడీ కేంద్రాల సిబ్బంది సమస్యల పరిష్కరానికి, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో చర్చించి త్వరలో గుడ్‌న్యూస్ చెబుతామని చెప్పారు.