అమెరికాలో తెలంగాణ యువతి అదృశ్యం

67చూసినవారు
అమెరికాలో తెలంగాణ యువతి అదృశ్యం
విదేశాల్లో చదువుకుంటున్న భారతీయలు ఇటీవలి కాలంలో విపరీత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ప్రమాదాల్లో చనిపోవడం, దాడులకు గురికావడం వంటివి జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన 23 ఏళ్ల అమ్మాయి నితీషా కందుల అమెరికాలో అదృశ్యమయ్యారు. మీడియా కథనాల ప్రకారం.. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ లో మే 28, 2024 నుంచి ఆమె కనిపించకుండా పోయింది. హైదరాబాద్‌కి చెందిన నితీషా కాల్ స్టేట్ యూనివర్సిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది.

సంబంధిత పోస్ట్