అమిత్ షాతో ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ

71చూసినవారు
అమిత్ షాతో ఎంపీ ఈటెల రాజేందర్ భేటీ
మల్కాజిగిరిలో భారీ మెజార్టీతో గెలిచిన ఎంపీ ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ కీలక నేత అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరికి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కింది. ఇందులో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ కిషన్ రెడ్డి ఉన్నారు. దీంతో అధ్యక్ష పదవీ బాధ్యతలు ఈటల రాజేందర్ కు కట్టబెడతారన్న వార్తల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో స్టేట్ చీఫ్ బాధ్యతలు ఈటల చేపట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సంబంధిత పోస్ట్