కవితకు ఎంపీ రఘునందన్‌ కౌంటర్‌

75చూసినవారు
కవితకు ఎంపీ రఘునందన్‌ కౌంటర్‌
TG: పసుపు బోర్డు తమ పోరాటం వల్లే వచ్చిందన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు కౌంటరిచ్చారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో కవిత జైల్లో ఉన్నప్పుడు ఆమె ఆరోగ్యం బాలేదని వార్తలు వచ్చాయి. ఇప్పటికైనా ఆమెను మంచి డాక్టర్‌కు చూపించాలి అంటూ కామెంట్స్‌ చేశారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వారికి రైతులు గుర్తుకు రాలేదని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్