40 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసులో న్యాయస్థానం తాజాగా ముగ్గురిని దోషులుగా తేల్చింది. 1981లో యూపీలోని మెయిన్‌పూరి జిల్లా దిహులి గ్రామంలో 24 మంది దళితులను డకాయిట్ల ముఠాకు చెందిన సింగ్, రాధే శ్యామ్ సహా మొత్తం 17 మంది అతి దారుణంగా హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటనపై కేసు నమోదైంది. కాగా 17 మందిలో 13 మంది ఇప్పటికే చనిపోగా న్యాయస్థానం ముగ్గురిని దోషులుగా తేల్చింది. మార్చి 18న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది.