రీల్స్ కోసం హత్య నాటకం.. ఇద్దరు అరెస్ట్

50చూసినవారు
రీల్స్ కోసం హత్య నాటకం.. ఇద్దరు అరెస్ట్
బెంగళూరులో ఇద్దరు యువకులు రీల్స్ కోసం చేసిన పిచ్చి పనికి అరెస్ట్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. హుమ్నాబాద్ రింగ్ రోడ్డు ప్రాంతంలో సాయిబన్నా, సచిన్ అనే ఇద్దరు వ్యక్తులు హత్య నాటకం వేశారు. ఇందుకోసం అచ్చం రక్తం రంగును, ఆయుధాన్ని వినియోగించారు. ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. అదికాస్తా పోలీసులు కంట్లో పడటంతో ఇద్దరిని అరెస్ట్ చేసి స్టేషన్‌‌కు తరలించారు. వ్యూస్ కోసం ఏది పడితే అది చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్