బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసులో ఆమె సవతి తండ్రి పర్వేజ్ తక్‌కు ముంబై కోర్టు మరణశిక్ష విధించింది. 2011 ఫిబ్రవరిలో ఆస్తి తగాదాల కారణంగా పర్వేజ్ మొదటిగా లైలా ఖాన్ తల్లి సెలీనాను చంపాడు. అనంతరం లైలాతో పాటు ఆమె నలుగురు తోబుట్టువులను కూడా దారుణంగా చంపేశాడు. అప్పటి నుంచి విచారణ చేపట్టిన కోర్టు అతడిని ఈ నెల 9న దోషిగా తేల్చింది. లైలా ఖాన్.. రాజేశ్ ఖన్నా సరసన ‘వఫా’ మూవీలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.