నా తండ్రే నన్ను లైంగికంగా వేధించేవాడు: నటి ఖుష్బూ
చిన్నతనంలో తన తండ్రి వల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని నటి ఖుష్బూ తాజాగా వెల్లడించారు. "నాపై దాడి గురించి బయటకు చెబితే ఇంట్లో వాళ్లను నా తండ్రి నరకయాతనకు గురిచేస్తాడని భయపడ్డా. అందుకే ఎన్నో దారుణాలు భరించా," అని ఆమె తెలిపారు. తన కాళ్లపై తాను నిలబడిన తర్వాత ఆయనకు ఎదురుతిరిగానని ఖుష్బూ చెప్పారు. "దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. షూటింగ్ సెట్ కు వచ్చి అందరిముందు నన్ను బాగా కొట్టేవాడు,” అని గుర్తు చేసుకున్నారు.