టీటీడీ చైర్మన్‌గా నాగబాబు.. క్లారిటీ!

21614చూసినవారు
టీటీడీ చైర్మన్‌గా నాగబాబు.. క్లారిటీ!
టీటీడీ చైర్మన్‌గా మెగా బ్రదర్‌ నాగబాబును నియమించబోతున్నారంటూ వస్తున్న వార్తలపై నాగబాబు స్పందించారు. ఆ వార్తల్లో ఏ మాత్రం కూడా నిజం లేదని స్పష్టం చేశారు. తాను ఏ పదవిని ఆశించడం లేదని చెప్పారు. జనసేన పార్టీకి అండగా ఉంటానని తెలిపారు. కాగా పార్టీలో కీలకంగా ఉన్న నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిని ఇవ్వాలని పవన్.. చంద్రబాబును అడిగారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నాగబాబు స్పందించి అదంతా వట్టి ప్రచారమేనని స్పష్టంచేశారు.

సంబంధిత పోస్ట్