Oct 14, 2024, 06:10 IST/
అక్కడ వాహనాలకు నో టోల్ ఫీజు: సీఎం
Oct 14, 2024, 06:10 IST
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కీలక ప్రకటన చేశారు. ముంబైకి వెళ్లే మార్గంలోని మొత్తం ఐదు టోల్ బూత్ల వద్ద లైట్ మోటార్ వాహనాలకు టోల్ ఫీజులను వసూలు చేయబోమని తెలిపారు. ఇది సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.