బెక్కెర పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్ పంపిణీ
కల్వకుర్తి మండల పరిధిలోని బెక్కర గ్రామం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆ పాఠశాల ఎస్ఎంసి కమిటీ సభ్యులు 15వేల రూపాయలతో స్పోర్ట్స్ డ్రస్ ని సమకూర్చారు. అలాగే గ్రామ యువకుడు మంథోజు నరేష్ ఒకటవ తరగతి విద్యార్థులకు ఐడీ కార్డ్స్ కోసం 800 రూపాయలు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందించడం జరిగింది. దాతలకు విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధన్యవాదాలు తెలిపారు.