చింతపల్లి మండలంలోని పాలెం తండా గ్రామపంచాయతీలో గత రెండు రోజులుగా కరెంటు రావడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోవడం లేదు. వర్షాకాలం కావడంతో పాముల బెడద కారణంగా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి వెంటనే కరెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని పాలెం తండా గ్రామస్తుడు కొర్ర రమేష్ నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.