దేవరకొండ ఆర్టీసీ డిపో నుండి హైదరాబాద్ మాచర్ల రూట్లో నడిచే 4 డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు బహుమతులు అందజేయనున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ సైదులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సుల్లో గిఫ్ట్ బాక్సులు ఏర్పాటు చేశామని, మహిళలు తమ ప్రయాణం పూర్తైన తర్వాత టికెట్ వెనక పేరు, ఫోన్ నెంబర్ రాసి గిఫ్ట్ బాక్సులో వేయాలని, 15 రోజులకు ఒకసారి డ్రా తీసి ముగ్గురికి బహుమతులు అందజేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.