ఉత్పత్తిదారుల సంఘానికి ఎన్నికలు నిర్వ‌హించాలి: పంది నరేష్

52చూసినవారు
ఉత్పత్తిదారుల సంఘానికి ఎన్నికలు నిర్వ‌హించాలి: పంది నరేష్
నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమీ నేడు గ్రామంలో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఎన్నికలు నిర్వ‌హించాల‌ని సీపీఎం పార్టీ గ్రామ శాఖ కార్యదర్శి పంది నరేష్ డిమాండ్ చేశారు. పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి గత సంవత్సరములో ఎన్నికలు నిర్వహించకుండా రైతుల తోటి మీటింగ్ ఏర్పాటు చేసి డైరెక్టర్లను ఎన్నుకున్నారు. "పాల ఉత్పత్తి దారులు మేనేజర్‌కు మాత్రం ఎన్నికల నిర్వహించినట్టు తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈసారి ఈ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఎన్నికలు నిర్వహించకుండా సొంత నిర్ణయాలు తీసుకొని మీటింగ్ ద్వారా కొత్త డైరెక్టర్లను ఎన్నుకోవాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ పద్ధతి సరైనది కాదు కావున పాల ఉత్పత్తిదారుల యొక్క అభిప్రాయం మేరకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నాం. లేనియెడల ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాం." అని నరేష్ హెచ్చరించారు.

ట్యాగ్స్ :