ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

81చూసినవారు
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మిర్యాలగూడ పట్టణంలోని ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల్లో పకడ్బంధి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన ఆదేశించారు. బుధవారం పట్టణంలోని డీఅర్సీ కేంద్రాన్ని ఆర్డివో శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూం కమీషనింగ్ గదులను ఆమె పరిశీలించి స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలు, భద్రత చర్యలపై రెవెన్యూ పోలీసు అధికారులకు సూచనలు చేశారు.