
2న మిర్యాలగూడలో త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు
శాస్త్రీయ సంగీత పీఠం, శ్రీ రామానుజదాస ప్రాజెక్ట్ వారిచే మిర్యాలగూడ పట్టణంలో శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాలు ఆదివారం ఘనంగా జరగనున్నాయి. 18 వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి రచించిన అనేక కీర్తనలను, శాస్త్రీయ సంగీత రాగాలను రంగాచార్యులు మరియు వారి శిష్య బృందం వినిపించనున్నారు. సీతారామచంద్ర దేవాలయం, శాంతినగర్ నందు సాయంత్రం 5 గంటల నుండి ఈ సంగీత కచేరీ నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.