మర్రిగూడె మండలం యరగండ్లపల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీకంఠమహేశ్వర సురమాంబ దేవాలయ నిర్మాణానికి తన వంతుగా 55, 000/- రూపాయిలు విరాళాన్ని వల్లంల సంతోష్ యాదవ్ తన నివాసంలో కమిటీ సభ్యులకు అందజేశారు. సంతోష్ మాట్లాడుతూ ఆ దేవుని అనుగ్రహం ఉంటే మన గ్రామానికి కావలసిన సహాయ సహకారాలను అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంగం నాయకులు ముద్దం శ్రీను గౌడ్, తదితరులు ఉన్నారు.