కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పి ఎస్ ఓ అయిన బయ్య పిచ్చయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం రాత్రి 7 గంటలకు బలగం సినిమా వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా బయ్య పిచ్చయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, మానవ విలువలు తెలియజేసే బలగం సినిమాను గ్రామంలోని చిన్నలు, పెద్దలు అందరు వచ్చి చూడాలని కోరుతున్నారు.