సర్కార్ దవాఖాన ఓపిలో పేరు రాయమంటే బూతులు తిడుతున్నారు

74చూసినవారు
నల్గొండ గవర్నమెంట్ ఆసుపత్రికి జబ్బు చేసి హాస్పిటల్ కి చూపించుకుందామని వెలితే పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారు. నల్లగొండ మండలం పానగల్లుకు చెందిన తగుళ్ల పాపయ్య అనే వ్యక్తి చర్మానికి సంబంధించిన సమస్యతో హాస్పిటల్ కి వెళ్ళగా బయటి రోగుల పేరు నమోదు చేసే విభాగం దగ్గర పేరు నమోదు చేసే ఉద్యోగి అత్యుత్సాహంతో బూతులు తిట్టారు. దీంతో చేసేది లేక బాధితుడు మరో కౌంటర్లో పేరు నమోదు చేసుకున్నాడు.

ట్యాగ్స్ :