గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పర్యావరణ పరిరక్షణ కోసం ఊరికొక మట్టి గణపతి విగ్రహం చొప్పున స్థాపించాలనే ఉద్యమంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ శ్రీమతి అనితారామచంద్రన్ కలిసి గణపతి మట్టి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనితారామచంద్రన్ మాట్లాడుతూ..గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కృషిని అభినందించారు.ఈ కరోనాలాంటి విపత్కర సమయంలో పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ వచ్చే వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు. ఊరికొక మట్టి గణపతి విగ్రహాన్ని పెట్టండి కరోనాని తరిమి కొట్టండి అని పిలుపునిచ్చారు.మట్టి విగ్రహాలు పూజించడం వల్ల పర్యావరణం కాపాడండి మరియు సామూహిక నిమజ్జనాలు లేకుండానే మన ఇంటి ఆవరణలోని మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసుకునే వెసులుబాటు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మట్టి విగ్రహాల శిల్పి జిల్లావాసి గుండాల గోవర్ధన్ ని అభినందించారు. మట్టి విగ్రహాల శిల్పి గుండాల గోవర్ధన్ మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను రెండు అడుగుల ఎత్తు నుంచి ఆరడుగుల ఎత్తు వరకు వెయ్యి విగ్రహాలను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లావ్యాప్తంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చిన అందుకు కలెక్టర్ అనితారామచంద్రన్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విగ్రహాలు కావలసినవారు 9441550927,8885515554, నెంబర్లు సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ మెరుగు మధు, రాష్ట్ర కోశాధికారి గణేష్ గౌడ్ శెట్టి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త పాముల అశోక్ ముదిరాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అధ్యక్షులు మాటూరి అశోక్, బాణాల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.