
సూర్యాపేట: వెంకట్ స్వామి ఆశయాలను సాధించాలి
సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి అన్ని వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని, ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తోందన్నారు.