శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపంతో అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతమంతా వణికిపోయింది. కొండ ప్రాంతాల్లో ఉంటున్నవారు భయాందోళన చెందారు. దేశ తూర్పు, ఈశాన్య ప్రాంతంలో భూ ప్రకంపనల తీవ్రత కనిపించింది. ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. సాధారణంగా ఈ ప్రాంతంలో అత్యంత అరుదుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. అలాంటిది ఒక్కసారిగా వచ్చిన ఈ
భూకంపం సుమారు 4.2 కోట్ల మందిని ఉలిక్కిపడేలా చేసింది.