అంబేద్కర్‌ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలి

966చూసినవారు
అంబేద్కర్‌ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలి
అంబేద్కర్‌ ఆశయ సాధనకు అందరం కృషి చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలంలోని చించోలి (బి) గ్రామ ఎక్స్ రోడ్ వద్ద రూ. 10. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అంబేద్కర్ ఆశలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్