గంగన్న పేటలో ప్రచారం

61చూసినవారు
గంగన్న పేటలో ప్రచారం
ఉట్నూరు మండలంలోని గంగన్నపేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో శనివారం ఉదయం వారు ఆ గ్రామంలోని పలు వార్డులలో ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజలకు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డి. రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్