ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

55చూసినవారు
ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
ఉట్నూర్ మండలంలోని లక్కారం గ్రామ శివారులో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలకు కాంగ్రెస్ యువ నాయకులు జయచంద్ర మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. శనివారం ఉదయం ఆయన లక్కారం గ్రామ శివారులో ఉపాధి హామీ కూలీలను కలిశారు. అనంతరం మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులు చేసి ఇళ్లకు త్వరగా వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్