ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో పెరుగుతున్న ఎండల ప్రభావం ఎంపీ ఎన్నికల ప్రచారంపై పడింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకున్నాయి. దీంతో అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉదయం తొమ్మిదిలోపు సాయంత్రం, ఐదు తర్వాత ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే ముఖ్య నాయకుల సమావేశాలు, ప్రచారాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎండ ప్రభావం ప్రచారంపై పడిందని నాయకులు అన్నారు.