జన్నారంలో అతి భారీ వర్షం నమోదు

83చూసినవారు
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో అతి భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో జన్నారం మండలంలోని పలు గ్రామాలలో ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. అనంతరం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల మధ్య భారీ వర్షం కురిసింది. దాదాపు నాలుగు రోజుల తర్వాత మండలంలో అతి భారీ వర్షం పడింది. ఉదయం నుండి కొంత పొడి వాతావరణమే ఉన్న మధ్యాహ్నానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయి అతి భారీ వర్షం నమోదయింది.

సంబంధిత పోస్ట్