జాతర మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం

68చూసినవారు
జాతర మహోత్సవాన్ని విజయవంతం చేద్దాం
పెంబి మండలంలోని తాటిగూడ గ్రామంలో ఉన్న జగదాంబ దేవి ఆలయంలో నిర్వహించే జగదాంబ దేవి, శ్రీరామనవమి జాతర మహోత్సవాలను విజయవంతం చేద్దామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు కోరారు. గురువారం మధ్యాహ్నం ఆ దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి ఆయన జాతర మహోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ఏప్రిల్ 9 నుండి 17వ తేదీ వరకు జగదాంబ దేవి ఆలయంలో జాతర మహోత్సవాలు జరగనున్నాయని వెల్లడించారు. అందరూ హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్