ఆర్టీసీ బస్సు-టిప్పర్ ఢీ.. ఒకరి మృతి (వీడియో)
AP: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి జంక్షన్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టగా.. అదే లారీని మరో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరు క్లీనర్లతో సహా 12 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.