సర్వే వివరాలు అందించాలి

73చూసినవారు
సర్వే వివరాలు అందించాలి
మిషన్ భగీరథ సర్వేకు అందరూ సహకరించాలని జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామ పంచాయతీ ఈవో రాహుల్ కోరారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం ఆ గ్రామంలోని పలు కాలనీలలో పంచాయతీ సిబ్బందితో కలిసి ఆయన మిషన్ భగీరథ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో మిషన్ భగీరథ నల్ల, నీటి సరఫరా, తదితర సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి పంచాయతీ సిబ్బంది వచ్చి సర్వే నిర్వహిస్తారని, వారికి వివరాలు అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్