తగ్గిన పచ్చదనం

52చూసినవారు
తగ్గిన పచ్చదనం
జన్నారం పట్టణంలో రోజురోజుకూ పచ్చదనం తగ్గిపోతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ కవ్వాల్ అభయారణ్యానికి జన్నారం పట్టణం ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఒకప్పుడు పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా పెద్ద చెట్లు ఉండేవని, దీంతో వాతావరణ చల్లగా ఉండేదన్నారు. అయితే వివిధ కారణాలతో ఆ చెట్లను కొట్టివేయడంతో రహదారికి ఇరువైపులా పచ్చదనం కరువైందని, ఆ మార్గంలో కొత్త మొక్కలను నాటాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్