సన్న బియ్యం వెంటనే ఇవ్వాలి

72చూసినవారు
సన్న బియ్యం వెంటనే ఇవ్వాలి
రేషన్ దుకాణం ద్వారా ప్రజలకు సన్నబియ్యం అందించాలని ఆదర్శ కళా సమితి డైరెక్టర్ లింగంపల్లి రాజలింగు అన్నారు. సోమవారం మధ్యాహ్నం జన్నారంలోని ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రేషన్ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడం లేదని, దీంతో వారు ఆ బియ్యాన్ని తినలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం ప్రజలకు లబ్ధిదారులకు సన్న బియ్యం ఇస్తామని హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్