అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం

81చూసినవారు
అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం
గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలలో ప్రజల అవసరమైన తాగునీరు, డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్