జంగుబాయి దేవతకు పూజలు

62చూసినవారు
జంగుబాయి దేవతకు పూజలు
కెరమెరి మండలంలోని పరండోలి గ్రామంలో ఉన్న ఆదివాసుల ఆరాధ్య దైవం జంగుబాయి దేవతకు ఉట్నూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శనివారం మధ్యాహ్నం వారు పరండోలి గ్రామానికి వెళ్లి అక్కడ జంగుబాయి దేవాలయాన్ని సందర్శించారు. అనంతరం వారు జంగుబాయి దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ మండలం ఎంపీపీ జైవంత్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్