ఘనంగా భీమన్న దేవుని పండగ

63చూసినవారు
ఘనంగా భీమన్న దేవుని పండగ
తానూర్ మండలంలోని మొగిలి గ్రామంలో ఆదివాసీ నాయక్ పోడ్ కులస్థుల ఆధ్వర్యంలో మంగళవారం భీమన్న పండగను ఘనంగా నిర్వహించారు. ఏటా మృగశిర కార్తె ప్రారంభంలో పంటలకు అనుగుణంగా సరైన సమయంలో వర్షాలు కురిసి పంటలు పుష్కలంగా పండాలని ఈ పండుగ జరుపుకుంటామని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మణ్, ఆదివాసీ నాయక్ పోడ్ కులస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్